| కీర్తనలు | త్యాగరాజు | ఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య |
| నారాయణ గౌళ - చాపు |
| పల్లవి: |
| ఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి? ఇపుడైన దెలుపవయ్య! ॥ఇన్నాళ్ళు॥ |
| అను పల్లవి: |
| చిన్న నాట నుండి నిన్నేగాని నే నన్యుల నమ్మితినా? ఓ రామ! ॥ఇన్నాళ్ళు॥ |
| చరణము(లు): |
| అలనాడు తరణి సుతార్తినిఁ దీర్పను వలసి నిల్వగ లేదా? అదియుగాక బలము జూపలేదా? వాని నేర ములకుఁ దాళుకొని చెలిమిఁజేసి పద ముల భక్తి నియ్యగ లేదా? నాయందు నీ ॥కిన్నాళ్ళు॥ |
| ధన గజాశ్వములు దనకుఁ గలుగఁ జేయు మని నే నిన్నడిగితినా? ఇఁక నే కనక మిమ్మనినానా? శ్రీరామ నా మనమున నిను కులధనముగ సం రక్షణముఁ జేసితిగాని మరచితినా? ॥ఇన్నాళ్ళు॥ |
| తల్లి తండ్రి యన్నదమ్ములు నీవని యుల్లము రంజిల్లఁ బెద్దలతోను కల్లలాడక మొల్ల సుమముల నీ చల్లని పదములఁ గొల్లలాడుచు వెద జల్లితిగాని త్యాగరాజునిపై నీ ॥కిన్నాళ్ళు॥ |