| కీర్తనలు | త్యాగరాజు | ఈ మేను గలిగినందుకు సీతారామ - నామమే బల్కవలెను |
| వరాళి - ఆది |
| పల్లవి: |
| ఈ మేను గలిగినందుకు సీతారామ నామమే బల్కవలెను ॥ఈమేను॥ |
| అను పల్లవి: |
| కామాది దుర్గుణస్తోమ పూరితమైన పామరత్వమేగాని నేమము లేనట్టి ॥ఈమేను॥ |
| చరణము(లు): |
| సంసారమున బ్రోవ దారిని పర హింసజెందు కిరాతుఁడు హంసరూపుల గతినడుగ రామనామ ప్ర శంసజేసి యుపదేశించ ధన్యుఁడు గాలేదా? ॥ఈమేను॥ |
| తాపసి శాపమిడగా జలోరగ రూపముగొని యుండగా తాపము సైరించక తల్లడిల్లగ శర చాపధరుని నామ శ్రవణము బ్రోవలేదా? ॥ఈమేను॥ |
| కరిరాజు తెలియలేక బలుఁడైన మ కరిచేత గాసి జెందగా అరలేక నిజమున నాదిమూలమనగ వరదుఁడు వేగమే వచ్చి బ్రోవగలేదా ॥ఈమేను॥ |
| ఆగమ వేదములను దానవుఁడు గొంపో వగా చతురాననుఁడు త్యాగరాజనుత తారక నామ యని బాగుగ నుతింప భయము దీర్పగ లేదా? ॥ఈమేను॥ |