| కీర్తనలు | త్యాగరాజు | ఈవసుధ నీవంటి దైవము నెందు గానరా |
| శహాన - ఆది |
| పల్లవి: |
| ఈవసుధ నీవంటి దైవము నెందు గానరా ఈ.. |
| అను పల్లవి: |
| భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ ఈ.. |
| చరణము(లు): |
| ఆసచే యరనిమిషము నీ పుర వాసమొనరఁజేయువారి మది వేసటలెల్లను దొలగించి ధన రాసుల నాయువును భూసురభక్తియు తేజము నొసఁగి భువనమందుఁగీర్తి గల్గఁజేసె దాసవరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ ఈ.. |