| హరికాంభోజి - రూపకము |
| పల్లవి: |
| ఉండేది రాముఁడొకడు ఊరక చెడిపోకు మనసా ॥ఉం॥ |
| అను పల్లవి: |
| చండమార్తాండ మధ్యమండలమునను చెలంగుచు ॥ఉం॥ |
| చరణము(లు): |
తామసాది గుణరహితుఁడు ధర్మాత్ముఁడు సర్వసముడు
క్షేమకరుఁడు త్యాగరాజచిత్తహితుఁడు జగమునిండి ॥ఉం॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - uMDeedi raamu.rDokaDu uuraka cheDipooku manasaa ( telugu andhra )