| కీర్తనలు | త్యాగరాజు | ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి |
| సారంగ - దేశాది |
| పల్లవి: |
| ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి ఎవరీడు ముజ్జగములలోఁ దన కెం.. |
| అను పల్లవి: |
| చెంతఁజేరి సౌజన్యుఁడై పలికి చింత బాగ తొలగించి బ్రోచితివి ఎం.. |
| చరణము(లు): |
| మున్ను మీ సమీపమున వెలయు స న్మునులనెల్ల నణిమాది లీలలచేఁ దిన్నగాను పాలనఁ జేసి నటు నన్నుఁ గాచితివి త్యాగరాజనుత ఎం.. |