| కీర్తనలు | త్యాగరాజు | ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య |
| ముఖారి - రూపకము |
| పల్లవి: |
| ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య ॥మెం॥ |
| అను పల్లవి: |
| దాంతులు వరకాంతలు జగమంత నిండియుండఁగ ॥నెం॥ |
| చరణము(లు): |
| కనులార సేవించి కమ్మని ఫలముల నొసఁగి తనువు పులకరించఁ బాదయుగములకు మ్రొక్కి ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పద మును పొందిన త్యాగరాజ నుతురాలి పుణ్యమ్మును ॥ఎం॥ |