| కీర్తనలు | త్యాగరాజు | ఎంతనేర్చిన ఎంతజూచిన |
| సింధుధన్యాసి - దేశాది (ఉదయరవిచంద్రిక - దేశాది) |
| పల్లవి: |
| ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే ॥ఎం॥ |
| అను పల్లవి: |
| సంతతంబు శ్రీకాంతస్వాంత సి ద్ధాంతమైన మార్గ చింతలేని వా ॥రెం॥ |
| చరణము(లు): |
| పరహింస పరభామాన్యధన పరమానవాపవాద పరజీవనమ్ముల కనృతమే భాషించేరయ్య త్యాగరాజ నుత ॥ఎం॥ |