| బిందుమాలిని - ఆది |
| పల్లవి: |
ఎంతముద్దో ఎంత సొగసో
ఎవరివల్ల వర్ణింపఁ దగునే ॥ఎం॥ |
| అను పల్లవి: |
ఎంతవారలైనఁగాని కామ
చింతాక్రాంతులైనారు ॥ఎం॥ |
| చరణము(లు): |
అత్తమీఁద కనులాసకు దాసులు
సత్త భాగవత వేసులైరి
దుత్త పాలరుచిఁ దెలియ సామ్యమె
ధురీణుఁడౌ త్యాగరాజ నుతుఁడు ॥ఎం॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMtamuddoo eMta sogasoo ( telugu andhra )