| కీర్తనలు | త్యాగరాజు | ఎంతరాని తన కెంత పోని నీ |
| హరికాంభోజి - దేశాది |
| పల్లవి: |
| ఎంతరాని తన కెంత పోని నీ చింత విడువఁజాల శ్రీరామ ఎం.. |
| అను పల్లవి: |
| అంతకారి నీ చెంతఁ జేరి హను మంతుఁడై కొలువలేదా ఎం.. |
| చరణము(లు): |
| శేషుఁడు శివునికి భూషుఁడు లక్ష్మణ వేషియై కొలువలేదా ఎం.. |
| శిష్టుఁడు మౌనివరిష్ఠుఁడు గొప్ప వ శిష్ఠుడు హితుఁడు గాలేదా ఎం.. |
| నరవర నీకై సురగణమును వా నరులై కొలువగలేదా ఎం.. |
| ఆగమోక్తమగు నీ గుణముల శ్రీ త్యాగరాజు బాడఁగ లేదా ఎం.. |