| కీర్తనలు | త్యాగరాజు | ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? |
| శుద్ధదేశి - ఆది |
| పల్లవి: |
| ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని ॥న్నెం॥ |
| అను పల్లవి: |
| అందమైన కుందరదన - యిందిరా హృన్మందిరా! ని ॥న్నెం॥ |
| చరణము(లు): |
| నీదు పలుకె పలుకురా నీదు కులుకే కులుకురా నీదు తళుకే తళుకురా నిజమైన త్యాగరాజసుత! ని ॥న్నెం॥ |