| కీర్తనలు | త్యాగరాజు | ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ |
| తోడి - త్రిపుట |
| పల్లవి: |
| ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ కెం.. |
| అను పల్లవి: |
| సందడియని మఱచితివో ఇందులేవో నీ కెం.. |
| చరణము(లు): |
| సారెకు దుర్విషయసార మనుభవించు వారి చెలిమి సేయనేరక మేను శ్రీరామ సగమాయెఁ జూచి చూచి నీరజదళనయన నిర్మలాపఘన ఎం.. |
| తీరని భవనీరధి యాఱడి సైరింప నేరక భయమందఁగఁ బంకజపత్ర నీరువిత మల్లాడఁగ ఇట్టి నను జూచి నీరదాభశరీర నిరుపమ శూర ఎం.. |
| జాగేల యిది సమయమేగాదు చేసితే ఏ గతి బలుకవయ్య శ్రీరామ నీ వేగాని దరిలేదయ్య దీనశరణ్య త్యాగరాజ వినుత తారక చరిత ఎం.. |