| కీర్తనలు | త్యాగరాజు | ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య |
| దర్బారు - త్రిపుట |
| పల్లవి: |
| ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య ॥ఎందుండి॥ |
| అను పల్లవి: |
| అంద చందము వేరై నడత లెల్ల త్రిగు ణాతీతమై యున్నదుగాని శ్రీరామ ॥ఎందుండి॥ |
| చరణము(లు): |
| చిటుకంటె నపరాధ చయములఁ దగిలించే శివలోకముగాదు వటరూపుఁడై బలిని వంచించి మణచువాని వైకుంఠముగాదు విట వచనము లాడి శిరము ద్రుంప బడ్డ విధిలోకముగాదు ధిటవు ధర్మము సత్యము మృదు భాషలు గలుగు దివ్యరూప త్యాగరాజ వినుత నీ ॥వెందుండి॥ |