| కీర్తనలు | త్యాగరాజు | ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు? |
| మాళవశ్రీ - ఆది |
| పల్లవి: |
| ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు? ॥ఎన్నాళ్ళు॥ |
| అను పల్లవి: |
| ఎన్నరాని దేహము లెత్తి యీ సంసార గహనమందు పన్నుగ చోరుల రీతి పరులను వేఁగించుచును ॥ఎన్నాళ్ళు॥ |
| చరణము(లు): |
| రేపటి కూటికి లేదని రేయిఁ బగలు వెసనమొంది శ్రీపతి పూజల మరచి చేసినట్టి వారివలె నే ॥నెన్నాళ్ళు॥ |
| ఉప్పు కర్పూరము వరకు నుంఛవృత్తిచే నార్జించి మెప్పులకు పొట్టనింపి మేమే పెద్దల మనుచు ॥నెన్నాళ్ళు॥ |
| భ్రమను కొని యిరుగుఁ బొరుగు భక్షింప రమ్మని పిలువ అమరుకొని పూజ జపము నా సాయము జేతుననుచు ॥నెన్నాళ్ళు॥ |
| నాయందు యుండు తప్పులు నాఁడె దెలుసుకొంటివిగాని బాయ విడువకు మహానుభావ! త్యాగరాజ వినుత ॥నెన్నాళ్ళు॥ |