| కలావతి - ఆది |
| పల్లవి: |
| ఎన్నడు చూతునో ఇనకులతిలక ని న్నె.. |
| అను పల్లవి: |
పన్నగశయన! భక్తజనావన!
పున్నమచందురుఁబోలు ముఖమ్మును ఎ.. |
| చరణము(లు): |
ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వా
నరయూథపతి వరుఁడాంజనేయుఁడు
కరుణను ఒకరికొకరు వర్ణింప నా
దరణను బిలిచే నిను త్యాగరాజార్చిత! ఎ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ennaDu chuutunoo inakulatilaka ni ( telugu andhra )