| కీర్తనలు | త్యాగరాజు | ఎవరని నిర్ణయించిరిరా ని |
| దేవామృతవర్షిణి - దేశాది (ఖరహరప్రియ - ఆది) |
| పల్లవి: |
| ఎవరని నిర్ణయించిరిరా ని న్నెట్లారాధించిరిరా నర వరు ॥లె॥ |
| అను పల్లవి: |
| శివుఁడనో మాధవుడనో కమల భవుఁడనో పరబ్రహ్మమనో ॥ఎ॥ |
| చరణము(లు): |
| శివమంత్రమునకు మా జీవము మా ధవమంత్రమునకు రాజీవము ఈ వివరముఁ దెలిసిన ఘనులకు మ్రొక్కెద వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥న్నె॥ |