| కీర్తనలు | త్యాగరాజు | ఎవరిచ్చిరిరా శరచాపము; నీ? నికకులాబ్ధి చంద్ర |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| ఎవరిచ్చిరిరా శరచాపము, నీ? నికకులాబ్ధి చంద్ర ॥ఎవ॥ |
| అను పల్లవి: |
| అవతరించు వేళ నుండెనో? లేక యవని కేగి యార్జించితివో? శ్రీరామ! నీ ॥కెవ॥ |
| చరణము(లు): |
| ఒకటేసి యైనఁ బది నూరై వెయ్యై పకపక లాడి శత్రుల నణచెనట వికలుని కాకిని బ్రోవ త్రిమూర్తులు వెనుకఁ దీసినారట సకల ద్రుమకుల్యుల నదీపతికై సంహరించెనట ప్రకట కీర్తిగల్గిన కోదండ పాణి! శ్రీత్యాగరాజనుత! నీ ॥కెవ॥ |