| మాళవశ్రీ - దేశాది |
| పల్లవి: |
ఎవరున్నారు బ్రోవ
ఇంత తామసమేలనయ్య ఎ.. |
| అను పల్లవి: |
వివరంబుగ దెల్పవయ్య
విశ్వేశ శ్రీ పంచనదీశ ఎ.. |
| చరణము(లు): |
మనసారగ ధ్యానింపను
మనసు నిలుపు మర్మంబు దెలిపి
తనవాడనే దలచి ధైర్య
మొసగు త్యాగరాజ వినుత ఎ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evarunnaaru broova ( telugu andhra )