| కీర్తనలు | త్యాగరాజు | ఎవరురా నినువినా గతిమాకు |
| మోహన - చాపు |
| పల్లవి: |
| ఎవరురా నినువినా గతిమాకు ॥ఎ॥ |
| అను పల్లవి: |
| సవరక్షక నిత్యోత్సవ సీతాపతి ॥ఎ॥ |
| చరణము(లు): |
| రాదా నాదుపై నీ దయ విన రాదా మురవైరిగాదా దయఁ బల్క రాదా యిది మరియాదా నాతో వాదమా నే భేదమా మాకు ॥ఎ॥ |
| రాక నన్నేచ న్యాయమా ప రాక నేనంటే హేయమా రామా రాకాశశిముఖ నీ కాసించితి సాకుమా పుణ్యశ్లోకమా మాకు ॥ఎ॥ |
| శ్రీశారిగణారాతివి నా దాశా తెలియకబోతివి ఆప గేశార్చిత పాలితేశా నవ కాశమా స్వప్రకాశమా మాకు ॥ఎ॥ |
| రాజా బిగు నీ కేలరా త్యాగ రాజార్చిత తాళఁ జాలరా ఈజాలము సేయ రాజా బ్రోవ సం కోచమా సురభూజమా మాకు ॥ఎ॥ |