| కీర్తనలు | త్యాగరాజు | ఎవరైన లేరా పెద్దలు? ఇలలోన దీనుల బ్రోవను |
| సిద్ధసేన - రూపకం |
| పల్లవి: |
| ఎవరైన లేరా పెద్దలు? ఇలలోన దీనుల బ్రోవను ॥ఎవరైన॥ |
| అను పల్లవి: |
| భవసాగరమున చరించు బలు గాసి రామునితోఁ దెలుప ॥ఎవరైన॥ |
| చరణము(లు): |
| కలి మానవాధముల కార్యములు కామ మత్సరాదుల కృత్యములు చల చిత్తము లేని దారిపుడు చాల త్యాగరాజ నుతునితో దెలుప ॥ఎవరైన॥ |