| కీర్తనలు | త్యాగరాజు | ఏ తావున నేర్చితివో రామ; యెందుకింత గాసి |
| యదుకులకాంభోజి - దేశాది |
| పల్లవి: |
| ఏ తావున నేర్చితివో రామ; యెందుకింత గాసి ॥ఏ॥ |
| అను పల్లవి: |
| సీతా లక్ష్మణ భరత రిపుఘ్న వాతాత్మజులతో నాడు నాటక ॥మే॥ |
| చరణము(లు): |
| ఆలు వజ్రాలు సొమ్ము లడిగిరో అనుజులు తల్లి దండ్రు లన్న మడిగిరో? శీలులైన వర భక్తులు బిలచిరో? చిరకాలము త్యాగరాజనుత! ॥ఏ॥ |