| శృతిరంజని - దేశాది |
| పల్లవి: |
| ఏ దారి సంచరింతురా ఇఁకఁ బల్కురా ఏ.. |
| అను పల్లవి: |
శ్రీ దాది మధ్యాంత రహిత
సీతాసమేతగుణాకర నే నే.. |
| చరణము(లు): |
అన్ని తానను మార్గమునకు జనితే
నన్ను వీడను భారమని యనేవు
నన్నుఁ బ్రోవరా సదా యంటే
ద్వైతుఁడనేవు త్యాగరాజనుత ఏ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ee daari saMchariMturaa i.rka.r balkuraa ( telugu andhra )