| కీర్తనలు | త్యాగరాజు | ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో |
| వకుళాభరణం - త్రిపుట |
| పల్లవి: |
| ఏ రాముని నమ్మితినో నేనే పూలఁబూజ జేసితినో ఏ.. |
| అను పల్లవి: |
| వారము నిజదాసవరులకు రిపులైన వారి మదమణచే శ్రీరాముడుగాదో ఏ.. |
| చరణము(లు): |
| ఏకాంతమున సీత సోకార్చిఁ జోగొట్ట కాకాసురుఁడు చేయు చీకాకు సైరించు కోక మదిని దయలేక బాణమునేసి ఏకాక్షునిఁ జేసిన సాకేతపతి గాదో ఏ.. |
| దారపుత్రులవద్ద చేరనీక రవికు మారుని వెలవట బారదోలి గిరిఁ జేరఁ జేసినట్టి తారానాయకుని సం హారము జేసిన శ్రీరాముడు గాదో ఏ.. |
| రోషము నాడు దుర్భాషలను విని వి భీషణుఁడావేళ ఘోషించి శరణన దోషరావణు మదశోషకుండైన ని ర్దోష త్యాగరాజ పోషకుండు గాదో ఏ.. |