| కిరణావళి - దేశాది |
| పల్లవి: |
ఏటి యోచనలు చేసేవురా
ఎదురుబల్కు వారెవరు లేరురా ఏ.. |
| అను పల్లవి: |
నోటిమాట జార్చఁగ రాదురా
కోటివేల్పులలో మేటియైన నీ వే.. |
| చరణము(లు): |
మెండుశూరులలో వెనుక తీయవని
రెండుమాటలాడేవాఁడు గాదని
అండకోట్లఁ బాలించేవాఁడని
చండమౌనులాడ త్యాగరాజనుత ఏ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eeTi yoochanalu cheeseevuraa ( telugu andhra )