| కీర్తనలు | త్యాగరాజు | ఏమి జేసిన నేమి? శ్రీరామ, స్వామి కరుణ లేని వారిలలో |
| తోడి - చాపు |
| పల్లవి: |
| ఏమి జేసిన నేమి? శ్రీరామ స్వామి కరుణ లేని వారిలలో ॥నేమి॥ |
| అను పల్లవి: |
| కామమోహ దాసులై శ్రీరాముని కట్టు తెలియని వారిలలో ॥నేమి॥ |
| చరణము(లు): |
| ఇమ్ము కలిగితే నేమి ఇల్లాలికి సొమ్ము బెట్టితే యేమి కమ్మవిల్తు కేళిని దెలిసియేమి తమ్మికంటివాని కరుణలేనివా రిలలో ॥నేమి॥ |
| సవము జేసితే నేమి కలిమికి పుత్రో త్సవము గలిగితే నేమి భువిలో నన్యబీజ జనితునిఁ గొనియేమి శివకర శ్రీరాముని దయలేని వారిలలో ॥నేమి॥ |
| మేడఁగట్టితే నేమి అందున లందరు జోడు గట్టితే నేమి చేడియలను మెప్పించఁ గెలిసితే నేమి ఈడులేని రాముని దయ లేనివా రిలలో ॥నేమి॥ |
| రాజ్యమేలితే నేమి బహుజనులలో పూజ్యులైతే నేమి ఆజ్య ప్రవాహముతో నన్న మిడితే నేమి పూజ్యుఁడైన రాముని దయ లేని వారిలలో ॥నేమి॥ |
| గురువు తానైతేనేమి కంటికి మేను గురువై తోచితే నేమి పరమంత్రమన్యుల కుపదేశించితే నేమి వర త్యాగరాజనుతుని దయ లేనివా రిలలో ॥నేమి॥ |