| కీర్తనలు | త్యాగరాజు | ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు |
| అఠాణ - ఆది |
| పల్లవి: |
| ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు ॥ఏ॥ |
| అను పల్లవి: |
| బాల! కనకమయచేల! సుజనపరి పాల! శ్రీరమాలోల! విధృతశర జాల! శుభద! కరుణాలవాల! ఘన నీల! నవ్య వనమాలికాభరణ! ॥ఏ॥ |
| చరణము(లు): |
| రారా దేవాదిదేవ! రారా మహానుభావ! రారా రాజీవనేత్రా! రఘువరపుత్రా! సారతర సుధాపూర హృదయ పరి వార జలధిగంభీర దనుజ సం హార దశరథ కుమార బుధజన వి హార సకలశృతిసార నాదుపై ॥ఏ॥ |
| రాజాధిరాజ! మునిపూజితపాద! రవి రాజలోచన! శరణ్య అతిలావణ్య! రాజధరనుత! విరాజ తురగ! సుర రాజవందిత పదాజ! జనక! దిన రాజకోటి సమతేజ! దనుజగజ రాజ నిచయ మృగరాజ! జలజముఖ! ॥ఏ॥ |
| యాగరక్షణ! పరమ భాగవతార్చిత! యోగీంద్ర సుహృద్భావిత! ఆద్యంతరహిత! నాగశయన! వరనాగ వరద! పు న్నాగ సుమధుర! సదాఘమోచన! స దాగతిజ ధృతపదా! గమాంతరచర! రాగ రహిత! శ్రీత్యాగరాజ నుత ॥ఏ॥ |