| ముఖారి - ఆది |
| పల్లవి: |
| ఏలావతార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై ఏ.. |
| అను పల్లవి: |
ఆలము సేయుటకా అయోధ్య
పాలనఁ జేయుటకా ఓ రాఘవ ఏ.. |
| చరణము(లు): |
యోగులను జూచుటకా భవ
రోగులను బ్రోచుటకా శత
రాగరత్నమాలికలు రచించిన
త్యాగరాజునకు వర మొసంగుటకా ఏ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eelaavataara mettukoMTivi eemikaaraNamu raamu.rDai ( telugu andhra )