| కీర్తనలు | త్యాగరాజు | ఒరుల నాడుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ |
| శుద్ధసావేరి - ఆది |
| పల్లవి: |
| ఒరుల నాడుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ ॥ఒరుల॥ |
| అను పల్లవి: |
| పరితాపము తాళక మొఱలిడగా కరుణ లేక నీవే నను జూడగ ॥ఒరుల॥ |
| చరణము(లు): |
| మంచివారి సహవాసము బాసి కొంచెపు నరుల కొఱకు నుతి జేసి యెంచిన కార్యము గూడని గాసి స హించ కుండెడిది నా పేరు వాసి ॥ఒరుల॥ |
| రాశియనుచు నరులను చేబూని వాసి యుండెడిది భవాని ఆశప్రియ! నే ముందురాని జేసిన కర్మ మనుకోవలెగాని ॥ఒరుల॥ |
| దేవ త్యాగరాజ వినుత! సనక భావనీయ! రఘుకుల తిలక! ఈ వరకును నాదు తను వలయక నీవే తెలుసుకోవలెగాక ॥ఒరుల॥ |