| కీర్తనలు | త్యాగరాజు | ఓ రంగశాయీ బిలిచితే |
| కాంభోజి - ఆది |
| పల్లవి: |
| ఓ రంగశాయీ బిలిచితే ఓ యనుచు రారాదా ఓ.. |
| అను పల్లవి: |
| సారంగవరుఁడు జూచి కైలా సాధిపుఁడు గాలేదా ఓ.. |
| చరణము(లు): |
| భూలోక వైకుంఠమిది యని నీలోన నీవే యుప్పొంగి శ్రీలోలుఁడై యుంటే మా చింత దీరే దెన్నడో |
| మేలోర్వలేని జనులలోనే మిరుల నొగిలి దివ్యరూపమును ము త్యాల సరుల యురమును గనవచ్చితి త్యాగరాజ హృద్భూషణ ఓ.. |