| కన్నడగౌళ - దేశాది |
| పల్లవి: |
ఓరచూపు జూచేది న్యాయమా
ఓ రఘూత్తమా నీవంటివానికి ॥ఓ॥ |
| అను పల్లవి: |
నీరజాక్ష మును నీదాసులకు
నీకేటివాపులు దెల్పవె ॥ఓ॥ |
| చరణము(లు): |
మానమించుకైన నీకుఁ దోచలేకపో
యిన వైనమేమి పుణ్యరూపమా
దీనరక్షక! శ్రిత మానవ సం
తాన! గానలోల! త్యాగరాజనుత ॥ఓ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - oorachuupu juucheedi nyaayamaa ( telugu andhra )