| నారాయణగౌళ - ఆది |
| పల్లవి: |
| కదలేవాఁడుగాఁడే రాముఁడు - కథలెన్నోగలవాఁడె ॥క॥ |
| అను పల్లవి: |
| మొదలే తానైనాఁడే - తుదిమొదలే లేనివాఁడైనాడే ॥క॥ |
| చరణము(లు): |
కల్పన లెన్నడులేఁడు సం - కల్పములే గలవాఁడు శేష
తల్పశయనుఁడే వాఁడు శ్రీ - త్యాగరాజనుతుఁడై నాఁడే ॥క॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kadaleevaa.rDugaa.rDee raamu.rDu - kathalennoogalavaa.rDe ( telugu andhra )