| కీర్తనలు | త్యాగరాజు | కన కన రుచిరా కనకవసన! నిన్ను |
| వరాళి - ఆది |
| పల్లవి: |
| కన కన రుచిరా కనకవసన! నిన్ను క.. |
| అను పల్లవి: |
| దిన దినమును మనసున చనువున నిన్ను క.. |
| చరణము(లు): |
| పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను క.. |
| బాలార్కాభిసుచేల మణిమయ మాలాలంకృత కందర సర సిజాక్ష వరకపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ క.. |
| సాపత్నిమాతయౌ సురుచిచే కర్ణశూలమైన మాట వీనులఁ జురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి సుఖింపగ లేదా యటు క.. |
| మృగమదలలామ శుభనిటల వర జటాయు మోక్షఫలద పవమాన సుతుఁడు నీదు మహిమఁ దెల్ప సీత దెలిసి వలచి సొక్క లేదా యారీతి నిన్ను క.. |
| కామించి ప్రేమమీర కరముల నీదు పాద కమలములఁ బట్టుకొను వాఁడు సాక్షి రామనామ రసికుఁడు కైలాస సదనుఁడు సాక్షి మఱియు నారద పరాశర శుక శౌనక పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్షిగాద సుందరేశ సుఖ కలశాంబుధివా సాశ్రితులకే క.. |
| సుఖస్పద విముఖాంబుధర పవనవిదేహ మానస విహారా ప్త సురభూజమానిత గుణాంక చిదా నంద ఖగతురంగ ధృతరథాంగ పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహార శ్రీరఘుపతే కన.. |
| కలమను ముఖ కళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచు నిన్ను క.. |
| సతతము ప్రేమ పూరితుఁడగు త్యాగరాజ నుత ముఖజిత కుముదహిత వరద నిన్ను క.. |