| కీర్తనలు | త్యాగరాజు | కరుణాజలధే, దాశరథే, గమనీయ సుగుణ నిధే |
| కేదారగౌళ - చాపు |
| పల్లవి: |
| కరుణాజలధే, దాశరథే, గమనీయ సుగుణ నిధే ॥కరుణా॥ |
| అను పల్లవి: |
| తరుణాంబుజ నిభ చరణా! సురమదహరణా! శ్రితజన శరణాద్భుతఘన! ॥కరుణా॥ |
| చరణము(లు): |
| మనవిని వినక యోచన జేసిన నే విననయ్య శ్రీరామ! ఓ పరమ పా వన! తారక నామ! సుగుణధామ! జనకతనయావన! చతుర్ముఖ జనక! జనక వచన సుపరి పా లనము జేసిన వనజలోచన! సనకనుత! మా ధనము నీవే ॥కరుణా॥ |
| సురముని వరనుత! సరసముతో నన్ను కరుణించిన నీదు తండ్రి సొమ్ము వెరవక బోనేరదు ఎందుకు వాదు? హరిగణాధిప పరిచ! రాగమ చర! పరాత్పర! తరముగాదిక చరణ భక్తి వితరణ మొసగను తరుణమిది, శ్రీకర! ధరాధిప! ॥కరుణా॥ |
| ధనమదమున నుండు మనుజుల నేను యా చన సేయగ లేనురా త్యాగరాజ వినుత! ఘృణాసాగర! సమీర తనయ సేవిత! ధనదనుత! స జ్జన మనోహర! ఘనరవ స్వర! మనసు చాలా వినదురా యీ తనువు నీదని వినుతి జేసెద ॥కరుణా॥ |