| కీర్తనలు | త్యాగరాజు | కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ! |
| పూర్ణలలిత - ఆది |
| పల్లవి: |
| కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ! ॥కలుగునా॥ |
| అను పల్లవి: |
| పలుమారు జూచుచు బ్రహ్మానందుఁడై బరగెడు భక్తాగ్రేసర! తనకు ॥కలుగునా॥ |
| చరణము(లు): |
| వేకువ జామున నీ కరమున నిడి శ్రీకాంతుఁ డమృత స్నానము జేసి తా సీ, తా కరములచే భుజించి నిను సా త్వీక పురాణ పఠన జేయుమను సాకేత పతిని సర్వాధారుని ప్రాకటముగ త్యాగ రాజనుతుని గన ॥కలుగునా॥ |