| కీర్తనలు | త్యాగరాజు | కాలహరణ మేలరా హరే సీతారామ |
| శుద్ధసావేరి - రూపకము |
| పల్లవి: |
| కాలహరణ మేలరా హరే సీతారామ ॥కా॥ |
| అను పల్లవి: |
| కాలహరణ మేల సుగుణజాల కరుణాలవాల ॥కా॥ |
| చరణము(లు): |
| చుట్టుచుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భువిని పుట్టులేక నీ పదములఁ బట్టుకొన్న నన్నుఁ బ్రోవ ॥కా॥ |
| పొడవున ఎంతాడుకొన్న భూమిని త్యాగంబురీతి కడువేల్పుల మున్న నీవుగాక యెవరు నన్నుఁబ్రోవ ॥కా॥ |
| దినదినమును దిర్గితిర్గి దిక్కులేక శరణుఁజొచ్చి తనువుధనము నీదెయంటి త్యాగరాజ వినుత రామ ॥కా॥ |
| ఇష్టదైవమా మనోభీష్ట మీయలేక ఇంకఁ గష్టమా త్యాగరాజు కామితార్థ ఫలమొసంగ ॥కా॥ |