| కీర్తనలు | త్యాగరాజు | కొలువై యున్నాడే కోదండపాణి |
| దేవగాంధారి - ఆది |
| పల్లవి: |
| కొలువై యున్నాడే కోదండపాణి కొ.. |
| అను పల్లవి: |
| సలలితమతులై సారెకుశీలులై వలచుచు గోరివచ్చి సేవింపరే కొ.. |
| చరణము(లు): |
| జనకజభరతాదులతో మంచి నైవేద్యంబులు చనువున వేడుక నారగించి మెఱుపుకోట్లఁ గేరు కనకపటము సొమ్ములను ధరించి వేదోక్తమైన సనకవచనములచే తోషించి శ్రితులబోషించి కొ.. |
| వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవారసతులు బాగ నటింప నదిగాక పరాశరనారదమునులెల్ల నుతింప ఎంతెంతో నెనరున సురపతి వాగీశులు సేవింప మేను పులకరింప కొ.. |
| ఉడురాజముఖుఁడు శేషశయ్యపైని చెలంగఁగఁ గని పుడమికుమారి సుగంధముఁ బూయ నమ్మినవారలకే కడగంటినిఁ గోరిన వరమీయ త్యాగరాజు నెనరున అడుగడుగుకు మడపుల నందీయ శ్రీరామయ్య కొ.. |