| కీర్తనలు | త్యాగరాజు | కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా |
| తోడి - ఆది |
| పల్లవి: |
| కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా ఏటికి తిరిగేవే ఓ మనసా ॥కో॥ |
| అను పల్లవి: |
| సూటిగ శ్యామసుందరమూర్తిని మాటిమాటికిఁ జూచే మహారాజులకు ॥కో॥ |
| చరణము(లు): |
| గంగ నూపురంబునను జనించను రంగనిఁ గావేరి గని రాజిల్లను బొంగుచు శ్రీరఘునాథుని ప్రేమతోఁ బొగడే త్యాగరాజు మనవి వినవే ॥కో॥ |