| కీర్తనలు | త్యాగరాజు | కోరి సేవింపరారే కోర్కులీడేర |
| ఖరహరప్రియ - ఆది |
| పల్లవి: |
| కోరి సేవింపరారే కోర్కులీడేర కో.. |
| అను పల్లవి: |
| శ్రీరమణీకరమౌ కోవూరి సుందరేశ్వరుని కో.. |
| చరణము(లు): |
| సురులు వేయివన్నె బంగారు విరులచేఁ బూజింపఁగ భూ సురులు సనకాది మౌనివరులు నుతింపఁగ సిరులిత్తునని కొలువైయుండే శ్రీసౌందర్యనాయికా వరుని శ్రీ త్యాగరాజవరదుని పరమాత్ముని హరుని కో.. |