| కీర్తనలు | త్యాగరాజు | క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదార |
| ఆనందభైరవి - ఝంప |
| పల్లవి: |
| క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాతక విదార క్రూర జనగణ విదూర నిగమ సంచార సుందర శరీర ॥క్షీర॥ |
| చరణము(లు): |
| శతమఖాహిత విభంగ శ్రీరామ శమనరిపు సన్ను తాంగ శ్రిత మానసాంతరంగ జనకజా శృంగార జలజభృంగ ॥క్షీర॥ |
| రాజాధి రాజ వేష శ్రీరామ రమణీయ కర సుభూష రాజనుత లలితభాష శ్రీత్యాగ రాజాది భక్తపోష ॥క్షీర॥ |