| కీర్తనలు | త్యాగరాజు | క్షీరసాగరశయన నన్ను |
| దేవగాంధారి - ఆది |
| పల్లవి: |
| క్షీరసాగరశయన నన్ను చింతలఁ బెట్టవలెనా రామ ॥క్షీ॥ |
| అను పల్లవి: |
| వారణరాజును బ్రోవను వేగమె వచ్చినది విన్నానురా రామ ॥క్షీ॥ |
| చరణము(లు): |
| నారీమణికిఁ జీరలిచ్చినది నాఁడే నే విన్నానురా ధీరుఁడౌ రామదాసుని బంధము - దీర్చినది విన్నానురా నీరజాక్షికై నీరధి దాటిన - నీ కీర్తిని విన్నానురా తారకనామ త్యాగరాజనుత - దయతో నేలుకోరా రామా ॥క్షీ॥ |