| కీర్తనలు | త్యాగరాజు | గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ |
| శహాన - ఆది |
| పల్లవి: |
| గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ గి.. |
| అను పల్లవి: |
| పరివారులు విరిసురటులచే నిల బడి విసరుచుఁ కొసరుచు సేవింపఁగ గి.. |
| చరణము(లు): |
| పులకాంకితుఁడై యానందాశ్రు వుల నింపుచు మాటలాడవలెనని కలువరించఁగని పదిపూటలపైఁ గాచెదనను త్యాగరాజవినుతుని గి.. |