| కీర్తనలు | త్యాగరాజు | గీతార్థము సంగీతానందము |
| సురటి - దేశాది |
| పల్లవి: |
| గీతార్థము సంగీతానందము నీ తావునఁ జూడరా ఓ మనసా ॥గీ॥ |
| అను పల్లవి: |
| సీతాపతి చరణాబ్జము లిడుకొన వాతాత్మజునికి బాగతెలుసురా ॥గీ॥ |
| చరణము(లు): |
| హరిహర భాస్కర కాలాది కర్మము లను మతముల మర్మముల నెఱింగిన హరి వరరూపుఁడు హరి హయ వినుతుఁడు వర త్యాగరాజ వరదుఁడు సుఖిరా ॥గీ॥ |