| కీర్తనలు | త్యాగరాజు | గురులేక యెటువంటి గుణికిఁ దెలియఁగబోదు |
| గౌరీమనోహరి - జంప |
| పల్లవి: |
| గురులేక యెటువంటి గుణికిఁ దెలియఁగబోదు గు.. |
| అను పల్లవి: |
| కఱుకైన హృద్రోగ గహనమును గొట్టను సత్ గు.. |
| చరణము(లు): |
| తనువు సుత ధన దార దాయాది బాంధవులు జనియించి చెదరు జాలిన కరుణతో మనసునంటక సేయు మందనుచుఁ దత్త్వ బో ధనఁ జేసి కాపాడు త్యాగరాజాప్తుడవు గు.. |