| హరికాంభోజి - ఆది |
| పల్లవి: |
| చని తోడితేవే వో మనసా ॥చ॥ |
| అను పల్లవి: |
కనికరమ్ముతో కనికరమిడి చిర
కాలము సుఖమనుభవింప వేగమె ॥చ॥ |
| చరణము(లు): |
పతితుల బ్రోచే పట్టాధికారిని
పరమార్థమత విశిష్ఠానుసారిని
ద్యుతి నిర్జిత శతశంబరారిని
ధురీణ త్యాగరాజ హృచ్చారిని ॥చ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chani tooDiteevee voo manasaa ( telugu andhra )