| కీర్తనలు | త్యాగరాజు | చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా |
| ఆరభి - ఆది |
| పల్లవి: |
| చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా చాల.. |
| అను పల్లవి: |
| కాలముబోను మాట నిలుచును కల్యాణరామ! నాతో చాల.. |
| చరణము(లు): |
| తల్లి దండ్రి నేనుండ తక్కిన భయమేలరా యని పలుమారు నీవెంతో బాసలు జేసి ఇలలో సరివారలలో ఎంతో బ్రోచుచుండి పెద్దలతో బల్కి మెప్పించి త్యాగరాజునితో చాల.. |