| కీర్తనలు | త్యాగరాజు | చేర రా వదేమిరా? రామయ్య! |
| రీతిగౌళ - దేశాది |
| పల్లవి: |
| చేర రా వదేమిరా? రామయ్య! ॥చేర॥ |
| అను పల్లవి: |
| మేర గాదురా యిక మహా - మేరుధీర! శ్రీకర! ॥చేర॥ |
| చరనము: |
| తల్లి తండ్రి లేని బాల తన నాథుఁగోరు రీతి పలుమారు వేడుకొనిన బాలించ రాదా? వలచుచు నేను నీదు వదనారవిందమును దలచి కరఁగగ జూచి త్యాగరాజ సన్నుత! ॥చేర॥ |