| కీర్తనలు | త్యాగరాజు | చేసినదెల్ల మఱచితివో? ఓ రామ రామ! |
| తోడి - ఆది |
| పల్లవి: |
| చేసినదెల్ల మఱచితివో? ఓ రామ రామ! చే.. |
| అను పల్లవి: |
| ఆసకొన్నట్టి నన్నలయించుటకు మున్ను చే.. |
| చరణము(లు): |
| ఆలు నీకైన భక్తురాలనుచు నాడు ప్రాలుమాలక రవిబాలుని చెలిమియు చే.. |
| భాష తప్పకను విభీషణుని కొఱ కాది శేషుఁడగు తమ్ముని పోషించమని రాజు చే.. |
| రామా! శ్రీ త్యాగరాజ ప్రేమావతార! సీతా భామ మాటలు దెల్ప భీమాంజనేయు బ్రహ్మ చే.. |