| కీర్తనలు | త్యాగరాజు | జగదానందకారక! జయ జానకీ ప్రాణ నాయక! |
| నాట - ఆది |
| పల్లవి: |
| జగదానందకారక! జయ జానకీ ప్రాణ నాయక! జ.. |
| అను పల్లవి: |
| గగనాధిప! సత్కులజ! రాజ రాజేశ్వర! సుగుణాకర! సుజనశ్సేవ్య! భవ్య దాయక! సదా సకల జ.. |
| చరణము(లు): |
| అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ! సురసురభూ జ దధి పయోధి వాస హరణ! సుందరతర వదన! సుధామయ వ చో బృంద గోవింద సానంద! మా వరాజ రాప్త శుభకరా! నేక జ.. |
| నిగమనీరజా మృత్పోషక! నిమిషవైరి వారిద సమీరణ! ఖగ తురంగ! సత్కవి హృదాలయా! గణితవానరాధిప! నతాంఘ్రియుగ! జ.. |
| ఇంద్ర నీలమణి సన్నిభాపఘన! చంద్ర సూర్య నయ నాప్రమేయ! వా గీంద్ర జనక! సకలేశ! శుభ్ర నా గేంద్ర శయన! శమనవైరి సన్నుత! జ.. |
| పాద విజిత మౌని శాప! సవ పరి పాల! వర మంత్ర గ్రహణ లోల! పరమ శాంత! చిత్తజనకజాధిప! సరోజ భవ వరదా! ఖిల జ.. |
| సృష్టి స్థిత్యంతకార కామిత! కామిత ఫలదా! సమాన గాత్ర! శ చీపతి నుతాబ్ధి! మద హరానురా గ రాగ రాజిత కథా సారహిత! జ.. |
| సజ్జన మానసాబ్ధి సుధాకర! కు సుమ విమాన సురసా రిపు కరాబ్జ లాలిత చరణావగుణా సురగణ మదహరణ సనాతనా! జనుత జ.. |
| ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప! వాసవ రిపు జనకాంతక! క లాధర కలాధారాప్త! ఘృణాకర! శ రణాగత జనపాలన! సుమనో ర మణ! నిర్వికార! నిగమసారతర జ.. |
| కరధృత శరజాలా! సురమ దాప హరణా! వనీసుర సురావన! కవీన బిలజమౌని కృత చరిత్ర సన్నుత శ్రీత్యాగరాజనుత! జ.. |
| పురాణ పురుష! నృవరాత్మజా! శ్రిత పరాధీన! ఖరవిరాధ రావణ విరావణ! అనఘ! పరాషర మనో హర! వికృత త్యాగరాజ సన్నుత! జ.. |
| అగణిత గుణ! కనక చేల! సాల విదళ నారుణాభ సమాన చర ణా! పార మహిమాద్భుత! సుకవిజన హృత్సదన! సురముని గణ విహిత! కల శ నీరనిధిజా రమణ! పాప గజ నృసింహ! వర త్యాగరాజనుత! జ.. |