| కీర్తనలు | త్యాగరాజు | జయ మంగళం నిత్య శుభ మంగళం |
| నాదనామక్రియ - ఆది |
| పల్లవి: |
| జయ మంగళం నిత్య శుభ మంగళం ॥జయ॥ |
| అను పల్లవి: |
| మంగళ మవనిసుతా నాథునికి మంగళ మరవిందాక్షునికి మంగళ మద్భుత చారిత్రునికి మంగళ మాదిదేవునికి ॥జయ॥ |
| చరణము(లు): |
| సుందర వదనునికి సుదేహునికి బృందారక గుణవంద్యునికి మందర ధరునికి మన మాధవునికి శుభఫలదునికి ॥జయ॥ |
| ఇనకులమున వెలసిన రామునికి జనక వచన పరిపాలునికి మనసిజకోటి లావణ్యునికి కనక సింహాసన నిలయునికి ॥జయ॥ |
| మందానిల భోజశయనునికి మందాకినీ వరజనకునికి మందజనక శతసంకాశునికి మందార రూపునికి హరికి ॥జయ॥ |
| ఇంద్రాద్యష్ట దిగీశనుతునికి చంద్రాదిత్య సునయనునికి గ జేంద్రుని సంరక్షించిన రామచంద్రునికి జగద్రూపునికి ॥జయ॥ |
| రాజశేఖర ప్రియునికి మౌని రాజరాజ పూజితునికి త్యాగ రాజ వినుతునికి వర గజ రాజాది భక్తవరదునికి ॥జయ॥ |