| కీర్తనలు | త్యాగరాజు | జయ మంగళం నిత్య శుభ మంగళం |
| మోహన - జంప |
| జయ మంగళం నిత్య శుభ మంగళం ॥జ॥ |
| మంగళం మంగళం - మారామచంద్రునకు |
| మంగళం మంగళం - మాధవునకు ॥జ॥ |
| నిజదాసపాలునకు - నిత్య స్వరూపునకు |
| నజరుద్రవినుతునకు - నగధరునకు ॥జ॥ |
| నిత్యమై సత్యమై - నిర్మలంబైన యా |
| దిత్యకులతిలకునకు - ధీరునకును ॥జ॥ |
| రాజాధిరాజునకు - రవికోటితేజునకు త్యాగ |
| రాజనుతునకు రామ - రత్నమునకు ॥జ॥ |