| కీర్తనలు | త్యాగరాజు | జయమంగళం నిత్య శుభమంగళం |
| నాదనామక్రియ - ఆది |
| పల్లవి: |
| జయమంగళం నిత్య శుభమంగళం ॥జ॥ |
| మంగళ మవనిసుతానాథునికి - మంగళ మరవిందాక్షునికి మంగల మద్భుతచారిత్రునికి - మంగళ మాదిదేవునికి సుందరవదనునికి సుదేహునికి - బృందారకగణవంద్యునికి మందరధరునికి మన మాధవునికి శుభఫలదునికి ॥జ॥ |
| ఇనకులమున వెలసిన రామునికి - జనకవచనపరిపాలునికి మనసిజకోటిలావణ్యునికి - కనకసింహాసన నిలయునికి ॥జ॥ |
| మందానిలభోజశయనునికి - మందాకినీవరజనకునికి మందజనకశతసంకాశునికి - మందారరూపునికి హరికి ॥జ॥ |
| ఇంద్రాద్యష్ట దిగీశనుతునికి - చంద్రాదిత్యసునయనునికి - గ జేంద్రుని సంరక్షించిన రామ - చంద్రునికి జగద్రూపునికి ॥జ॥ |
| రాజశేఖర ప్రియునికి మౌని - రాజరాజపూజితునికి త్యాగ రాజవినుతునికి వరగజ - రాజాది భక్తవరదునికి ॥జ॥ |